అర్హులకే ఇళ్లు ఇవ్వాలని బీజేపీ నాయకుల డిమాండ్

Telangana Chowrasta
1 Min Read
మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు

మేడ్చల్ ముచ్చట్లు: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మేడ్చల్ బీజేపీ మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ విమర్శించారు.

శుక్రవారం మేడ్చల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో కొంత మందికే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.

“అర్హత లేని వారికి ఇళ్ల పట్టాలు ఎలా పంపిణీ చేస్తారు? నిజంగా అర్హులైన పేద కుటుంబాలను విస్మరించడం తీవ్ర అన్యాయం” అని శైలజ హరినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను మోసం చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, కనుగంటి వంశీ విజయ్, కార్యదర్శి విష్ణుమూర్తి, సాయి కుమార్, నాయకులు రాఘవ రెడ్డి, నవీన్ కుమార్, వంశీధర్ రెడ్డి, నర్సింగ్ రావు, శ్రీపాల్ రెడ్డి, వెంకటేష్, గౌలికర్ మహేష్, కేశవరెడ్డి, జాకట బాబురాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment