ఉప్పల్ స్టేడియం వద్ద DYFI ఆందోళన

Telangana Chowrasta
1 Min Read

HCAలో అవినీతిపై తీవ్ర విమర్శలు – అధ్యక్షుడి బర్తరఫ్‌కు డిమాండ్

మేడ్చల్ ముచ్చట్లు ;ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద బుధవారం నాడు డీవైఎఫ్ఐ (DYFI) ఆధ్వర్యంలో ఘనంగా ఆందోళన నిర్వహించారు. ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌ల టికెట్ల విషయంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) మరియు SRH మధ్య అవినీతి జరిగిందని ఆరోపించారు.

అధికార పదవిని ఉపయోగించి టికెట్లను బ్లాక్ చేయడం, కొందరు ప్రైవేట్ పార్టీలకు దానిని బలవంతంగా అందించడం వంటి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని డీవైఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యాపార వేత్తలకు హెచ్‌సీఏ వంటి క్రీడా సంస్థల్లో పదవులు ఇవ్వడం వల్ల క్రీడల పరిపాలన పూర్తిగా నాశనమవుతుందని వారు అన్నారు.

సీఐడీ విచారణలో హెచ్‌సీఏ లో తీవ్ర అక్రమాలు బయటపడిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తో పాటు సీఎస్‌ఇఓ, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను బర్తరఫ్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది.

ఈ ఆందోళనలో DYFI రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జావీద్, రాష్ట్ర నాయకులు RL మూర్తి, కొమ్ము విజయ్ కుమార్, నాగరాజు, రవి, కుమార్ రాజయ్య, ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment