మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని శ్రీ రాములగుట్ట శ్రీ సీతారామ చంద్ర స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతిష్ట చేయనున్న విగ్రహాల ఊరేగింపు చేశారు. అందరూ గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద నుండి మంచినీటిని తీసుకువచ్చి ప్రతిష్ట చేయనున్న విగ్రహాలపై అభిషేకం చేశారు. అనంతరం విగ్రహాలను శ్రీరాములగుట్ట ఆలయ ఆవరణలో ఉంచారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కోలాటం ఆటలు నిలిచాయి కళాకారులతో పాటు గ్రామస్తులు భక్తులు అంతా కలిసి ఎంతో ఘనంగా ఊరేగింపు చేశారు. గ్రామం మొత్తం శ్రీరామ నామ స్మరణలతో మారుమోగిపోయింది.





