కుత్బుల్లాపూర్‌లో విషాదం – కేబుల్ పనుల్లో కూలీ మృతి

Telangana Chowrasta
1 Min Read
గోపీ మృతదేహం

మేడ్చల్ ముచ్చట్లు: దుండిగల్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక కార్మికుడు దుర్మరణం చెందాడు.

గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన కరెంట్ కేబుల్ కోసం స్తంభం గుంత తవ్వే పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గుంత తవ్వుతున్న సమయంలో భూమిలో ఉన్న కేబుల్ వైర్ తగిలి కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామానికి చెందిన గోపి (34) గా గుర్తించారు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడ్డారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment