ఘట్కేసర్ మున్సిపాలిటీలో సర్దార్ పాపన్న గౌడ్ 177వ జయంతి వేడుకలు

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు; ఘట్కేసర్ మున్సిపాలిటీలో సర్దార్ పాపన్న గౌడ్ చౌరస్తా వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గౌడ్ 177వ జయంతి వేడుకలు జరిపారు.ముఖ్య అతిథిగా కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ కులానికె సంబంధించిన వ్యక్తి కాదాని అన్ని కులాలకు,మతాలకు సంబంధించిన వ్యక్తి అని ఆయన పోరాట ప్రతిభ ప్రపంచ నలుమూలల వ్యాపించిందని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారని ఆయన అన్నారు. ఇంత పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని చేపట్టిన ఘట్కేసర్ మున్సిపాలిటీ గౌడ సంఘం నాయకులను ఆయన అభినందించారు, ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఘట్కేసర్ మండల్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఘట్కేసర్ మండల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజి రెడ్డి, ఘట్కేసర్ రైతు సహకార సంఘం బ్యాంక్ మాజీ చైర్మన్, సారా శ్రీనివాస్ గౌడ్, డొంకెని బిక్షపతి గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు, మదనగిరి
సురేష్ గౌడ్, కౌన్సిలర్లు, కొమ్మగొని రమాదేవి, మహిపాల్ గౌడ్, బండారి ఆంజనేయులు గౌడ్, మ్మిడి అనురాధ రాఘవ రెడ్డి, చందుపట్ల వెంకట రెడ్డి, మాజీ ఎంపిటిసిలు మేకల నర్సింగ్ రావు, గోపాల్ రెడ్డి గౌడ సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment