మేడ్చల్ ముచ్చట్లు నాగారం మున్సిపాలిటీ రాంపల్లి లో రక్షాబంధన్ వేడుకలను గురువారం పట్టణ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సోదరీమణులు తమ సోదరులకు బొట్టుపెట్టి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా , నాగారం బస్టాండ్ ఏరియాలో వెలిసిన రాఖీ షాపుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని రికల్ ఫోర్ట్ హోమ్స్ అసోసియేషన్ కాలనీలో సంతోషంగా జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కిటకిటలాడాయి. స్వీట్ షాపులకు గిరాకి పెరిగి నాగారం సందడిగా మారింది. తోబుట్టువులతో కాలనీలు, ఇండ్లు కలకలాడాయి.




