మేడ్చల్ ముచ్చట్లు: చర్లపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చిన్నచెర్లపల్లి చౌరస్తా పక్కన కాళీ ప్రదేశంలోని చెట్లపొదల్లో కోడిపందాలు నిర్వహిస్తూ వారిపై దాడి చేసి వారిని తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు . వారి వద్ద నుండి రెండు పందెపు కోళ్లను, ఆరు చిన్న కోడి కత్తులు, 11,600 నగదు తో పాటు నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు . కోడిపందాలు ఆడుతున్న వుళ్లమాగుంట సుబ్బారావు ఏ ఎస్ రావు నగర్ సాయినాథ్ పురం కాలనీ నివాసి.రెండవ వ్యక్తి కటికేల చిన్నబాబు సత్యనారాయణ కాలనీ నాగారం నివాసి. మూడో వ్యక్తి పూడి సురేష్ జమ్మిగడ్డ సాకేత్ కి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .





