చర్లపల్లి చౌరస్తా దుర్గమ్మ దేవాలయంలో దొంగతనం

Telangana Chowrasta
0 Min Read

హుండీ పగలగొట్టి అమ్మవారి సొమ్ము లూటీ

మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీ చర్లపల్లి చౌరస్తాలో ఉన్న దుర్గమ్మ దేవాలయంలో హుండీ చోరీ జరిగింది, ఆలయదారులు తెలిపిన  వివరాలు ప్రకారం రాత్రి అమ్మవారి ఆలయం ప్రధాన తలుపును పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి ఆలయ హుండీ పగలగొట్టి హుండీలో ఉన్న సొమ్ము మొత్తం లూటీ చేశారని, తాము ఉదయము యధావిధిగా ఆలయానికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి హుండీ బయట పడేశారని తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Share This Article
Leave a Comment