మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో రాముల గుట్టపై ప్రతిష్టాపన మహోత్సవ వేడుక ఈరోజు వేద మంత్రోచ్ఛారణల మధ్య, గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహోత్సవానికి టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై దేవాలయంలో జరిగిన హోమం తదితర పూజా కార్యక్రమాలలో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకొని ,తీర్థప్రసాదాలు స్వీకరించారు .ఈ సందర్భంగా ఆలయ కమిటీ ,గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ ,ఉపసర్పంచ్ లు సింగం ఆంజనేయులు, కటికల వైద్యనాథ్ గార్ల ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ మహోత్సవంలో హరివర్ధన్ రెడ్డి గారితో పాటు నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ బండి జగన్నాథం ,జిల్లా నాయకులు గౌడవెల్లి బాల్ రెడ్డి, ఘనాపూర్ గ్రామ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, నాయకులు ఏనుగు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ సింగం సత్యనారాయణ, బండి రవి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, కందాడి శివరాం రెడ్డి,సుమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్, కీసరి నరసింహులు, వీరేశం సేటు, నరసింహులు, శశింధర్ రెడ్డి,భాను తదితరులు పాల్గొన్నారు.





