నాగారం పురపాలక సంఘ పరిధిలోని 5, 18 ,19, 20 వార్డులలో గల వరద నీటి సమస్య గురించి కార్మిక కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి కాలనీలలో భారీ వర్షాల కారణంగా నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్న పలు రోడ్లను పర్యవేక్షించిన అనంతరం వివిధ కాలనీ అధ్యక్షులతో, కాలనీవాసులతో మాట్లాడి ఇంజినీరింగ్ అధికారుల మ్యాప్ ప్రకారం సమస్యను బాక్స్ డ్రైనేజీ నిర్మాణం ద్వారా శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు కావాల్సిన నిధులు త్వరలోనే మంజూరు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి, కమిషనర్ జి రాజేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు, కాలనీ ప్రజలు అధికారులు పాల్గొన్నారు.







