మేడ్చల్ ముచ్చట్లు:మూడు చింతలపల్లి మండలం నారాయణపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం. వాహనదారుడు అక్కడికక్కడే మృతి. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం బోయిన్పల్లి తండాకు చెందిన కేతవత్ రాములు (36) గా గుర్తింపు. నారాయణపూర్ నుండి హకీంపేట్ డిపో కి చెందిన బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాములు రోజువారి కూలి పనులకు వెళ్తుంటాడు అతనికి ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు.




