బస్సు బైక్ ఢీ యువకుడి దుర్మరణం

Telangana Chowrasta
1 Min Read

షామీర్పేట్:తుర్కపల్లి కొల్తూరు రోడ్డు మధ్య బస్సు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదం లో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సిద్దిపేట జిల్లా మారుకుక్ మండలం వరధారాజ్ పురం కు చెందిన సంపత్(35) మూఢుచింతలపల్లి మండలం కొల్తుర్ పరిధిలో ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. రోజు లాగే వరధారాజ్ పురం నుంచి విధుల్లో భాగంగా కంపెనీ కి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యంలో కర్కపట్ల పరిధి లోని జొడాస్ కంపెనీకి కి చెందిన కంపెనీ బస్ ఉద్యోగులను తీసుకొస్తున్న క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దింతో బస్సు కిందకీ బైక్ వెళ్లడంతో అందులో చిక్కుకున్న వ్యక్తిని బస్సు ఈడ్చుకుంటూ కొద్ది దూరం వరకు లాక్కెళ్ళింది. సంపత్ పక్కనే ఉన్న పొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.బైక్ పెట్రోల్ ట్యాంక్ తెరుచుకొని రాపిడి వల్లన మంటలు చెలరేగి బస్ పూర్తిగా కాలిపోయింది . మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు.
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Share This Article
Leave a Comment