మేడ్చల్ ముచ్చట్లు ; జవహర్ నగర్ లో మల్లారెడ్డి ట్రస్ట్ సేవ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం చేపట్టారు.ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో జవహర్ నగర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లారెడ్డి ట్రస్ట్ సేవా ద్వారా ఉచిత పరీక్షలు చేశారు ఇందులో భాగంగా ఈసీజీ, బీపీ చెక్ అప్, బ్లడ్ షుగర్ చెకప్ తో పాటు ఉచిత మందులు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.





