మాదకద్రవ్యాలు , గంజాయి అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం;మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

Telangana Chowrasta
1 Min Read

ఉప్పల్ నియోజకవర్గంలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలు విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు, ఉప్పల్ అసెంబ్లీ బిజైవైయం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్ని ఎక్సైజ్ ఆఫీస్ లో నేలమీద కూర్చుని బిజైవైయం నాయకులతో కలిసి ధర్నా చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలమైందని ఉప్పల్ నియోజకవర్గంలో మద్యం, మాదకద్రవ్యాల అమ్మకాలు విపరీతంగా, విచ్చలవిడిగా కోనసాగిస్తున్నాయని పారిశ్రామిక వాడలు గంజాయి కేంద్రలుగా మారడంతోపాటు దానితోపాటు అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వైన్ షాపులు పోటిపడి బస్తీల్లో బెల్టుషాపులు పెట్టి పేదప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎక్సైజ్ శాఖ ఆదాయం 14,500 ఉంటే కెసిఆర్ పుణ్యమా అని వీధీకి బారు ఇంటికి బీరు అన్నట్లుగా పేద ప్రజల రక్తం తాగుతూ నాలుగు ఇంతలు పెరిగి 43వేల కోట్లకు చేర్చుకోని ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని, యువత పెడదారి పడుతోందిని కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిజైవైయం మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జీ రేవల్లి రాజు, జిల్లా అధ్యక్షుడు చల్లా ప్రభాకర్, బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు గోనె శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు సందీప్ యాదవ్, అభిషేక్ గౌడ్, తెలంగాణ సంపత్, నామా శ్రవణ్, మహేశ్వర్ రెడ్డి, ఆకుల రుషికేశ్, బిజైవైయం డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్, డప్పు దత్తసాయి, యం.దేవేందర్, అశోక్ ముదిరాజ్, బిజైవైయం నాయకులు వినయ్ రెడ్డి, గోపాల్, సుమన్ నాయక్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment