మేడ్చల్‌లో అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ప్రారంభం

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు:మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అత్యాధునిక క్యాత్ ల్యాబ్  ప్రారంభమైంది. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్‌లో సమగ్ర చికిత్స అందించేందుకు ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు మెడినోవా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మేడ్చల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇకపై అత్యవసర హృదయ చికిత్సల కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ క్యాత్ ల్యాబ్ ద్వారా హార్ట్ ఎటాక్ నిర్వహణ,యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రఫీ, పేస్‌మేకర్ ప్రక్రియలు, ఇతర ప్రాణరక్షక గుండె చికిత్సలను 24/7 అందించగలుగుతాం” అని చెప్పారు.

మెడిసిటి సీఈఓ ఇనిష్ మర్చంట్ మాట్లాడుతూ, “మా లక్ష్యం మేడ్చల్ ప్రజలకు అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలను అందించడం. కార్డియాలజీతో పాటు న్యూరాలజీ, న్యూరో సర్జరీ, స్ట్రోక్ యూనిట్, గ్యాస్ట్రోఎంటరాలజీ, బారియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ వంటి విభాగాలను కూడా ప్రారంభించాం. అందుబాటు ధరల్లో ఒకే చోట పూర్తి ఆరోగ్య సంరక్షణను అందించడమే మా కృత నిశ్చయమ” అని అన్నారు.

ప్రస్తుతం మేడ్చల్‌లో మొట్టమొదటి స్ట్రోక్ యూనిట్ విజయవంతంగా నడుస్తుండగా, ఇప్పుడు క్యాత్ ల్యాబ్ ప్రారంభం ప్రజలకు దగ్గరగా అత్యవసర వైద్య సేవలు అందించడానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెడిసిటి బృందంతో పాటు మెడినోవా వైద్యులు కూడా పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment