రాములగుట్ట ప్రతిష్టలో మంత్రి మల్లారెడ్డి

Telangana Chowrasta
1 Min Read

మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ రాములగుట్టలోని శ్రీ సీతారామచంద్రస్వామి ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా రెండవ రోజు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రతిష్టా పూజ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. దేవస్థాన కమిటీ మంత్రి మల్లారెడ్డిని ఘనంగా ఆహ్వానించి పూజ కార్యక్రమాలు విధానం ప్రతిష్ట కార్యక్రమాలు చేయు విధానాన్ని మంత్రికి వివరించారు.అనంతరం మంత్రిని శాలువాతో సత్కరించారు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,లక్ష్మాపూర్ సర్పంచ్ సింగం ఆంజనేయులు,ఎంపీటీసీ నాగరాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కటికల వైద్యనాథ్ ముడిచింతలపల్లి సర్పంచ్ జాము రవి,గౌటె గోపాల్అ,ప్పల సతీష్ బండి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment