రియాబిలిటేషన్ సెంటర్‌లో వ్యక్తి హత్య

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు : నాగారం మున్సిపాలిటీ ఎస్.వి. నగర్ జ్యోతి రియాబిలిటేషన్ సెంటర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వినాయక నగర్‌కు చెందిన కృష్ణ (52) అనే వ్యక్తిని దాదాపు 15 రోజుల క్రితం బంధువులు ఇక్కడ చికిత్స నిమిత్తం చేర్పించారు.సెంటర్‌లో వంట పని చూసుకునే కయ్యుం అనే వ్యక్తి, కృష్ణతో గత కొద్దిరోజులుగా విభేదాలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కయ్యుం, కృష్ణ ఛాతీపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు కయ్యుం అక్కడి నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

మీడియా తో మాట్లాడుతున్న మృతుడి భార్య లక్ష్మి

మృతుడి భార్య లక్ష్మీ మాట్లాడుతూ – “ఈ ఉదయం రియాబిలిటేషన్ యజమాని భాను మా కూతురికి ఫోన్ చేసి మీ నాన్న చనిపోయారని తెలిపాడు. మేము అక్కడికి చేరుకునేసరికి నా భర్త శవం మంచంపైనే పడిఉంది, మా భర్త చావుకు యజమానియే కారణం, ఆయనే సమాధానం చెప్పాలి”అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనా స్థలంలో పోలీసులు


కాగా యజమాని భాను, “నేను ప్రస్తుతం గోవాలో ఉన్నాను, తర్వాత వస్తాను” అని పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share This Article
Leave a Comment