లక్ష్మాపూర్ గ్రామస్తులను బయపెడుతున్న పెద్ద చెరువు

Telangana Chowrasta
1 Min Read

మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు కాలుష్యానికి గురవుతుంది దీని కారణంగా చెరువులో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడుతున్నాయి.పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూడా ఎటువంటి చర్యలు కనబడటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.చెరువుకు అతి సమీపంలో భారీ ఎత్తులో ఫార్మ కంపెనీల సెజ్ ఉండడం వాటి నుంచి వచ్చే వ్యర్ధాలు చెరువులోకి ప్రత్యక్షంగా,పరోక్షంగా రావడం వల్ల నీరు కాలుష్యానికి గురై చేపలు మృత్యువాత పడటంతో పాటు పంట పొలాలకు చేరే నీటిలో కూడా కెమికల్స్ కూడిన నీరు వస్తున్నాయి. దీంతో రైతులకు కూడా తీవ్ర తలనొప్పిగా మారింది ఇప్పటికైనా సంబంధిత అధికారులతో చొరవతీసుకొని సమస్యకి పరిష్కారం తేవాలని ప్రజలు గ్రామస్తులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment