మేడ్చల్ ముచ్చట్లు: శామీర్ పేట,అలియా బాద్ చౌరస్తా సమీపంలో ఒక విందు లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత ను కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు విందు కార్యక్రమంలో పాల్గొన్న కవిత ను కలవడానికి గుంపులు గుంపులుగా కార్యకర్తలు రావడంతో తీరిగ్గా మాట్లాడే అవకాశం రాలేదని, త్వరలో మళ్ళీ ఎమ్మెల్సీ కవిత ను కలుస్తానని, అప్పుడు అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడటం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన కవిత ను మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామ కూర మహేందర్ రెడ్డి, శామీర్ పేట మండల, జవహర్ నగర్,తూం కుంట , మేడ్చల్ కు చెందిన నాయకులు పాల్గొన్నారు.




