విజయవంతంగా ముగిసిన మెగా రక్తదాన శిబిరం

Telangana Chowrasta
1 Min Read
మండపం వద్ద రక్తదాన శిబిరం

మేడ్చల్ ముచ్చట్లు:వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా లక్కీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించిన 24వ సంవత్సర వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది.

నిర్వాహకులు రామస్వామి తెలిపిన వివరాల ప్రకారం శిబిరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగగా, ఇందులో 100కు పైగా దాతలు పాల్గొని రక్తదానం చేశారు.

రక్తదాతల ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కీ ఫ్రెండ్స్ అధ్యక్షులు రామస్వామి, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.

యూత్ అధ్యక్షులు రామస్వామి రక్తదానం చేస్తున్న దృశ్యం
Share This Article
Leave a Comment