శామీర్‌పేట: మండల కేంద్రం శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మతల్లి ఆలయ కమిటీ, శామీర్‌పేటకు చెందిన వాసగోని సువర్ణగణేష్గౌడ్ దంపతులు, దేశం లక్ష్మీసత్త్యస్వామిగౌడ్ దంపతులు, మజీద్‌పూర్ గ్రామ ఎంపీటీసీ సరసం మోహన్‌రెడ్డి దంపతుల సహకారంతో అన్నధానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నధాన కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినధులు, రాజీవ్ రహదారిపై వెల్లే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్ని అమ్మవారి తీర్ధప్రసాధాలను స్వీకరించారు.



