సర్వ అభిజ్ఞా ఫౌండేషన్వెబ్ సెట్ ప్రారంభించిన ఈటెల రాజేందర్

Telangana Chowrasta
2 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: మహిళా సాధికారిత, ఆర్ధిక స్వాలంబన స్వయం ఉపాధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన సర్వ అభిజ్ఞ ఫౌండేషన్ వెబ్ సైట్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా శుక్రవారం తన కార్యాలయంలో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారిత, ఆర్థిక స్వా లంబన స్వయం సమృద్ది ఉపాధి లక్ష్యంగా కీసర మండల రాంపల్లికి కి చెందిన శ్రీమతి లింగాల పుష్పలత ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ వెబ్ సైట్ ను ఈటెల ప్రారంభించి సర్వ అభిజ్ఞ ఫౌండేషన్ వెబ్ సైట్ మహిళల స్వయం ఉపాధితో పాటు ఆర్థికంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడేలా ఈ సంస్థ పనిచేయాలని ఈటెల ఆకాంక్షించారు. సంస్థ నిర్వాహకులు లింగాల పుష్ప లత ముదిరాజ్ మాట్లాడుతూ వ్యవసాయం , సాగు, పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్ లకు మద్దతుగా తదుపరి తరానికి సాధికారత కల్పించాల్లన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఇప్పటికే జీవనోపాధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టీ పైలట్ ప్రాజెక్టు గా వివిధ రంగాలలో కొంత మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ పొందిన తరువాత మేము వారి స్వంత స్థాపన తో వారికి మద్దతుగా ఉండి లబ్ది దారునికి కేంద్ర ,రాష్ట్ర పథకాల మీద అవగాహన కల్పించి లబ్ది దారుని అర్హత మేరకు ఏ లాంటి షరతులు లేకుండా లక్ష రూపాయల నుండి సుమారు ఐదు లక్షల రూపాయల వరకు మహిళలకు నేరుగా బ్యాంకుల ద్వారా రుణాలను అందజేసి, తెలంగాణ రాష్ట్రం లో అన్ని జిల్లాలో మా సంస్థ ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధి తోపాటు మహిళా సాధికారత సాధించడమే ద్యేయంగా సర్వ అభిగ్న ఫౌండేషన్ పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. సమాచారం కొరకు మా వెబ్ను సైట్ నీ ఓపెన్ చేసి మా ఫోను నంబరు కు సంప్రదిస్తే మా సభ్యులు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారని చెప్పరు. ఈ సందర్భంగా శ్రీమతి రమ్యకు రుణ సదుపాయం కింద పదివేల చెక్కును అందజేశారు వీటి ద్వారా స్వయం ఉపాధి సాధించడం కోసం ఏదైనా ఒక అనుబంధ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు వీలుగా అంద చేసినట్లు తెలిపారు.

వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్న ఈటెల రాజేందర్
Share This Article
Leave a Comment