ఘనంగా మంత్రి మల్లారెడ్డి పుట్టినరోజు వేడుకలు

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు; మైసమ్మ గూడ మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ లో మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టినరోజు అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో శామీర్ పేట కు చెందిన కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి మల్లారెడ్డి కి అఫ్జల్ ఖాన్, మంత్రి మల్లారెడ్డి ఫోటో తో కూడిన ఆల్బమ్ మెమోంటో ను బహుకరించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు అహర్నిశలు ప్రజలకు సేవ చేస్తు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ని గుర్తించి కేసీఆర్ గారు ఈ సారి కూడా టికెట్ కేటాయించారని, ఆయన్ని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఫోటో మెమోంటో ను చూసి అఫ్జల్ ఖాన్ ను మెచ్చుకున్నారు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే అఫ్జల్ ఖాన్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు మహ్మద్ గౌస్, తిరుపతి రెడ్డి,శంకర్,పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment