స్నేహా మహిళా పొదుపు సహకరా సొసైటీ నీ కీసర గ్రామం లోకి మార్చండి…

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: కీసర మండల పరిధిలోని స్నేహ మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సొసైటీలో కీసర గ్రామంలో దాదాపుగా 20 మహిళా గ్రూప్లు ఉన్నాయి. మహిళ స్నేహా పరస్పర పొదుపు సొసైటీనీ కీసర ఎంపీడిఓ ఆఫీస్ ప్రక్కన ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి మార్చాలన్నా నిర్ణయాన్ని స్నేహా మహిళా సహకార సొసైటీ మాజీ డైరెక్టర్లు రాంపల్లీ అరుంధతి, ఎం వీరమణి చిర్యల్, గోదుమకుంటా పద్మా , మాజీ ప్రెసిడెంట్ స్వప్నా కలసి తీవ్రంగా వ్యతిరేకించారు. సొసైటీ మహిళలు ఏకమై పాత సొసైటీ భవనం ముందు కూర్చొని, ధర్నా చేస్తూ నిరస తెలిపారు. ప్రక్కన ఉన్నా ఆరోగ్య కేంద్రంలోకీ సొసైటీ భవనం మార్చడం వల్ల రాకపోకలకు, సమావేశాలకు, చాలా ఇబ్బందీ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్నేహా మహిళా సొసైటిని కీసర గ్రామంలోనీ ప్రభుత్వా బిల్డింగ్ లోకి మార్చాలని కోరారు. కానీ ఆరోగ్య కేంద్రంలోకి మార్చడం వల్ల అక్కడ ప్రజల రద్దీ, హాస్పటల్ వాసన కూ మహిళలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు, అందుబాటులో ఉన్నా కీసర గ్రామంలోనీ బిల్డింగ్ లను వదిలేసి, అందరి మహిళల అభిప్రాయానికి విరుద్ధంగా, డిసిఓ వెంకటేశ్వర్ రెడ్డి, మనేజర్ టి,వీణా ఇష్టానుసారంగా ఆరోగ్యకేంద్రలొకి మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పరస్పర సహాయ సహకార సొసైటీ నీ కీసర విలేజ్ లోకి మార్చే దాక మా వంతుగా పోరాటం చేస్తామని మాజీ డైరెక్టర్స్, అరుంధతి, వీరమణి, పద్మా , మాజీ ప్రెసిడెంట్ స్వప్నా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ మహిళా సహకార సొసైటీ మహిళలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment