మేడ్చల్ ముచ్చట్లు :తెలంగాణ ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికలో భాగంగా నాగారం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సిడిఎంఏ జ్యోష్న, మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 3వ వార్డులోని పార్క్ లో బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలు నాటారు, వీది కుక్కల నియంత్రణ ఏబిసి కెన్నెల్ సందర్శించి వాటికీ పిల్లలు కనకుండా ఆపరేషన్ చేయాలి అని సూచనలు చేశారు.కంపోస్ట్ తయారీ కేందాన్ని సందర్శించి అందులో నుండి వేస్ట్ వాటర్ పోవడానికి కాలువలాగా చేయాలని డిఈకి సూచనలు చేశారు. నాగారం మహిళా సంఘాల సమైక్యలతో పరిచయ సమావేశం ఏర్పరిచి వారు తయారు చేస్తున్న వస్తువుల పైన వారి సంఘాల పేర్లు అడ్రస్సులు ఫోన్ నెంబరు పెట్టాలని సంఘాలకు సూచనలు చేశారు, మీరు చేస్తున్న వస్తువులకు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రచారం చేసి మీకు వస్తువులకు అమ్మకాలపై ప్రాధాన్యత చూపెట్టాలని సిడిఎంఏ జ్యోష్న గ్రూప్ సంఘాలకు సూచనలు చేశారు. అదేవిధంగా మహిళ సమాఖ్య, సర్ఫ్ వారి వస్తువులను వారు చేసినటువంటి వంటలను ప్రాజెక్టు డైరెక్టర్ సందర్శించి హర్షం వ్యక్తం చేశారు.







