
మేడ్చల్ ముచ్చట్లు ;జిల్లా పరిధిలో పశు సంచారా వైద్య సేవలు అందిస్తున్న 1962 సిబ్బంది గత మూడు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొంటున్నారన్నారని మేడ్చల్ జిల్లా పశు సంచార వైద్య వాహన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1962 ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకున్న కానీ ముగా జీవాలకు తాము వైద్య సేవలు అందిస్తున్నాము అని సిబ్బంది తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1962 పశు సంచార వైద్య సేవల సిబ్బందికి జీతాలు మంజూరీ చేయాలనీ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.



medchal muchhatlu