రవీంద్ర భారతిలో జరిగిన గజల్ కార్యక్రమం లో పాల్గొన్న అఫ్జల్ ఖాన్

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు;హైదరాబాద్ నగరం లో ని రవీంద్ర భారతిలో ప్రముఖ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ స్మృతి లో జరిగిన గజల్ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ జాఫర్ పహిల్వాన్, శామీర్ పేట్ కు చెందిన కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు ఇందులో ప్రముఖ గాయకులు సుల్తాన్ మిర్జా,ఇనాయత్ ఖాన్ , సంగీత విద్వాంసులు ఉస్తాద్ నిజాముద్దీన్ జావీద్ లు ప్రేక్షకుల ను మంత్ర ముగ్ధులు చేశారని అన్నారు. సంగీత కళాపోషన అందరికి అవసరమని అఫ్జల్ ఖాన్ తెలిపారు. ఇందులో జాఫర్ పహిల్వాన్, అఫ్జల్ ఖాన్ తో పాటు అతిధులుగా ఇషాఖ్ జ్యువెలరీ అధినేత ఎండి ఇషాఖ్ , శక్తి క్రేన్ అధినేత అఖిల్ వీరి తో పాటు నసీర్ మిర్జా, అలీషా ,రజియా సుల్తానా,ఆఫ్రీన్, నూరా ఖాన్, అల్తాఫ్ రసూల్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు .

Share This Article
Leave a Comment