వినాయక మండపం వద్ద రక్తదాన శిబిరం

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు :లక్కీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ వినాయక మండపం వద్ద ఈనెల 31వ తేదీ ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వినాయక కమిటీ సభ్యుడు రామస్వామి మాట్లాడుతూ, “రక్తదానం ఒక మహత్తరమైన దానం. ఒక్క బాటిల్ రక్తం అనేక ప్రాణాలకు ప్రాణాధారమవుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి సమాజానికి తోడ్పడాలి” అని పేర్కొన్నారు.

ఈ శిబిరం కోసం వైద్యులు, వాలంటీర్లు తగిన సదుపాయాలు కల్పించనున్నారు. రక్తదానం చేయబోయే వారికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి, తర్వాతే రక్తం సేకరిస్తారని నిర్వాహకులు తెలిపారు.

కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

రామస్వామి

Share This Article
Leave a Comment