మూడుచింతలపల్లి మున్సిపాల్టీ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లు

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు : మూడుచింతలపల్లి మున్సిపాల్టీ పరిధిలోని ప్రధాన చెరువులలో వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్  ఇంజనీర్ స్ఫూర్తి ఆధ్వర్యంలో  ముఖ్యంగా లక్ష్మాపూర్ పెద్దచెరువు వద్ద భద్రతా చర్యలతో పాటు లైటింగ్, క్రేన్ ఏర్పాటు చేశారు. విధుల్లో వైద్య బృందాలు, స్వచ్ఛంద సిబ్బంది మున్సిపల్ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా  మున్సిపల్ మేనేజర్ ఉష , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, అసిస్టెంట్ ప్రవీణ్,బిల్ కలెక్టర్లు శ్రీదర్, విజయ్ కుమార్ , బలరాజ్ , నర్సింలు, పరమేష్,వైద్య సిబ్బంది రాణి, పద్మ విధులు నిర్వహిస్తున్నారు.స్థానిక నాయకులు  కూడా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు అందించారు.

మున్సిపల్ సిబ్బంది
ఏర్పాట్లను ఆకస్మిక తనిఖీ
చేస్తున్న మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్
భక్తుల కోలాహలంతో చెరువు ప్రాంగణం

ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ ఉష మాట్లాడుతూ –”ప్రజలందరూ ప్రశాంతంగా, భద్రతతో వినాయక నిమజ్జనం చేసుకోవాలని మున్సిపాల్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. నిమజ్జనం సమయంలో ప్లాస్టిక్ పదార్థాలు వాడరాదు. మద్యం సేవించి ఎవరూ నిమజ్జనానికి రాకూడదు. మున్సిపాల్టీ, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి” అన్నారు.

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులు వారి అభిప్రాయాన్ని మేడ్చల్ ముచ్చట్లు తో పంచుకున్నారు స్థానికుడు చాడ షావుకారి మున్సిపాలిటీ చేసిన ఏర్పాట్లపై సంతృప్తి చెందారు

.”మన గ్రామంలో వినాయక నిమజ్జనం సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అధికారులు మంచి ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు. ప్రజలందరూ శాంతియుతంగా, భద్రతా నిబంధనలు పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనాలని కోరుతున్నాం. యువతలో ఉత్సాహం ఉన్నా కూడా నియమ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం” అని చాడ షావుకారి అన్నారు.

Share This Article
Leave a Comment