జీఎస్టీ భారీ తగ్గింపులపై హర్షం వ్యక్తం చేసిన బిజెపి రాష్ట్ర నేత పాతూరి సుధాకర్ రెడ్డి

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు:దేశ ప్రజలకు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ భారీ తగ్గింపులు, మినహాయింపులపై బిజెపి రాష్ట్ర నేత పాతూరి సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ ముందుగానే జీఎస్టీ సంస్కరణలను ప్రకటించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి రావడం పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఆహార పదార్థాలు, విద్య, వైద్య రంగం వంటి అవసరమైన అనేక వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించడమే కాకుండా, పెట్రోల్, డీజిల్, స్కూటర్లు, బైకులు, కార్లు, పారిశ్రామిక వస్తువులపై కూడా భారీగా పన్నులు తగ్గించారని తెలిపారు.ఈ చర్యలతో సాధారణ కుటుంబాల ఖర్చుల్లో 10 నుండి 20 శాతం వరకు ఆదా అవుతుందని ఆయన వివరించారు. అలాగే, వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నిజాయితీగా జీఎస్టీ చెల్లించాలని సూచించారు. కట్టని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు.పన్నుల సక్రమ సేకరణతో భారత్ ప్రపంచంలోనే అధిక ఆర్థిక లావాదేవీలు జరిపే దేశంగా ఎదుగుతుందని సుధాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment