ఎస్ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మేడ్చల్ బస్ డిపో ముందు ఆందోళన

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు:ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం మేడ్చల్ బస్ డిపో ముందు భారీ ఆందోళన జరిగింది. సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కార్తిక్ మాట్లాడుతూ, “బస్సుల ఆలస్యంతో విద్యార్థులు ఉదయం తరగతులు మిస్ అవుతున్నారు. సాయంత్రం ఆలస్యంగా చేరుకోవడం వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు” అని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోందని తెలిపారు. విద్యార్థుల బస్ పాస్ రుసుములు పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారం అవుతున్నాయని, వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనను గమనించిన డిపో మేనేజర్ విద్యార్థి నేతలతో చర్చించి, సమస్యలను పరిష్కరించడానికి పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, ఎస్ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు భగత్, శ్యామ్, జిల్లా కమిటీ సభ్యులు కరుణాకర్, ఆకాశ్, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి బాల కిరణ్, ఎస్ఎఫ్‌ఐ మండల కమిటీ సభ్యులు సుధీర్, రామ్, రాజు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment