శామీర్ పేట పెద్ద చెరువు నిండు కుండలా నిండడంతో నాయకులు,స్ధానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు విలాసాగరం సుదర్శన్ ఆధ్వర్యంలో పెద్ద చెరువు వద్ద కట్టమైసమ్మ తల్లి పూజలు కార్యక్రమాలు నిర్వహించారు.పెద్ద చెరువు వద్ద అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిఐ నిరంజన్ రెడ్డి పటీష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో విలాసాగరం సుదర్శన్,జెడ్పీటీసీ అనితా లాలయ్య,కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకుడు మహ్మద్ అఫ్జల్ ఖాన్,ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్,రైతు సహాకార సంఘం ఉపాధ్యక్షుడు ఐలయ్య యాదవ్,దాసరి బాబు,వంగ వెంకట్ రెడ్డి,వంగ నర్సింహ రెడ్డి,మహేందర్ యాదవ్,శంకర్ గౌడ్,బాబు,కుమార్,కేసిర్ శిష్యుడు పవన్ ముదిరాజ్,నవీన్ ముదిరాజ్,మేడిరవి,మేడి భాస్కర్,దూడల శ్రీకాంత్ గౌడ్,బుర్కవెంకటేష్,శివ,డేవిడ్,బాల్ రాం,పెద్ద ఎత్తున వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.



