జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో పురపాలనలో భాగంగా మేయర్ మేకల కావ్య అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి కార్పొరేషన్ లో అభివృద్ధి, శానిటేషన్, దోమల నివారణకు ఫాగింగ్, వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులు వాటికి తీసుకొనవాల్సిన జాగ్రత్తలు, పరిపాలనకు సంబంధించిన పది అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్ ఎస్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, టిఎస్ ఎస్ పి డిసి ఎల్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్, ఎస్ బి అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




