గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు :భారతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ గోపు రమణారెడ్డి, డిఫెన్స్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ వాలంటరీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఐపీఎస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జైళ్ళ శాఖ డిజిపి డాక్టర్ సి ఎన్ గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. జెండా ఊపి ఆయన ర్యాలీని ప్రారంభించారు.ఈ ర్యాలీలో దాదాపు 200 మందికి పైగా మాజీ సైనికులు మహిళలు పాల్గొనడం విశేషం.ఈ ర్యాలీ నేరేడ్మెట్, వినాయక నగర్ ,గౌతమ్ నగర్ , ఈస్ట్ ఆనంద్ బాగ్, మౌలాలి మీదుగా సాగింది. ర్యాలీకి విశేష స్పందన రావడంతో పాటు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీ జరుగుతున్నంతసేపు ప్రజలు ఆసక్తిగా తిలకించారు.ర్యాలీ అనంతరం అందరు కలిసి భోజనాలు చేశారు.

Share This Article
Leave a Comment