ఘట్కేసర్ మున్సిపాలిటీ అధికారులకు బహుమతులు

Telangana Chowrasta
1 Min Read

77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు.జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధిగా జిల్లా మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్బంగా మున్సిపాలిటీ ఉద్యోగులకి ఉత్తమ ఉద్యోగులుగా బహుమతులు ప్రధానం జరిగింది. ఘట్కేసర్ మున్సిపాలిటీ అధికారులకు బహుమతులు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు . ఉత్తమ ఉద్యోగుల ప్రధానం స్వీకరిస్తున్న డిప్యూటీ తాసిల్దార్ భాస్కర్ రెడ్డి,ఎస్సై అశోక్ , బీసీ హాస్టల్ వార్డెన్ శ్రవణ్ కుమార్ తోపాటు మున్సిపల్ కార్మికులు రాములు యాదగిరి కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ,పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment