జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మీడియా సమావేశం

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  ఆధ్వర్యంలో మీడియా సమావేశం.తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ కోఆర్డినేటర్,డి .సాయి ప్రసాద్ మాట్లాడుతూ, తన దర్శకత్వంలో నిర్మిస్తున్న డాక్యుమెంటరీ చిత్రాల గురించి వివరించారు. పిల్లల అక్రమరవాణా, మాదకద్రవ్యాల నివారణ, అసంఘటిత కార్మికుల కోసం, మెంటల్ ఆక్ట్ , మూఢనమ్మకాల పై చిత్రాలు నిర్మిస్తున్నారని, ఈ చిత్రాలగురించి ప్రజల్లో అవగాహన కలిగించాలని పాత్రికేయులను కోరారు. ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ మధుసూదన్ రావు పాల్గొన్నారు. సాయి ప్రసాద్ పది అంశాల మీద డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మిస్తున్నారని అవి జిల్లా వ్యాప్తంగా నలుమూలల ప్రదర్శించాలని పాత్రికేయులను కోరారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను ఎంచుకున్నందుకు  సాయిప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు.

Share This Article
Leave a Comment