మేడ్చల్ ముచ్చట్లు: మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కి కేసిఆర్ మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన సందర్భంగా ఆయన నివాసానికి కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకుడు మహ్మద్ అఫ్జల్ ఖాన్ చేరుకొని మల్లారెడ్డి చేతికి ఇమామే జామీన్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అఫ్జల్ ఖాన్ తో పాటు వైస్ ఎంపిపి ఎల్లు సుజాత కూడా మంత్రి మల్లారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్, ఎల్లు సుజాత మాట్లాడుతు కేసిఆర్ నాయకత్వంలో మంచి ఎమ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకొని ప్రజల సంక్షేమం కోసం పాటు పడే నాయకులని, అందుకే మల్లారెడ్డి ని గుర్తించి కేసీఆర్ గారు ఈ సారి కూడా టికెట్ కేటాయించారని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో చామకూర మల్లారెడ్డి ని గెలిపించుకుంటామని అఫ్జల్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్,ఎల్లు సుజాత తో పాటు, ఎల్లు తిరుపతి రెడ్డి, మహ్మద్ గౌస్, వంగ నర్సింహ రెడ్డి , పవన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




