మేడ్చల్ ముచ్చట్లు; బాయ్ ఫ్రెండ్ కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని బలవంతంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు హాస్టల్ కి సంబంధం ఏమి లేదంటూ లేఖ రాసి ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయింది.వివరాల్లోకి వెళితే సీఎంఆర్ కాలేజ్ విద్యార్థిని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణ పరిధిలోని సూర్యనగర్ కాలనీ లోని ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఉంటూ సీఎంఆర్ చదువుతున్న శ్రీవాణి (19) ఫ్యాన్ కి ఉరివేసుకొని వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు వనపర్తి జిల్లా కొత్తకోట గ్రామం చెందిన యువతి గా గుర్తించిన మేడ్చల్ పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకి ఒక సూసైడ్ నోట్ దొరికింది అందులో ”నాకు ఈ హాస్టల్ కి ఎటువంటి సంబంధం లేదు నా బాయ్ ఫ్రెండ్ వల్లనే నేను ఇలా చేసుకుంటున్న నా చదువు వలన కూడా .నా తల్లిదండ్రుల కు ఎం సంబంధం లేదు” అని ఉంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




