మేడ్చల్ ముచ్చట్లు ;గణేష్ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండడంతో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా చర్లపల్లి చెరువును మల్కాజ్గిరి డిసిపి, ఏసిపి సందర్శించారు.పోలీస్ అధికారులతో చర్చించి వారికి దిశ నిర్దేశం చేశారు.నిమజ్జనం సందర్భంగా చెరువు సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం గణేష్ నిమజ్జనం జరిగే చోటే టెంట్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటుతోపాటు భారీకేడ్లు ఏర్పాటు చేయాలని,మంచినీటి సౌకర్యము మొబైల్ టాయిలెట్స్ ఏర్పాట్లు,వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో చర్లపల్లి పోలీస్ స్టేషన్ సీఐ తోపాటు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ ;దినేష్ కుమార్




