
మేడ్చల్ ముచ్చట్లు:మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు రాధిక గుప్తా లాల్ గడి మలక్ పేట్ లోని హెచ్.బి. కాలనీలో ఉన్న ఆంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు ఆట పాటలతో, ఆటవస్తువులతో విద్యను అందించడంతో పాటు పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించడం ప్రతి ఆంగన్వాడి సిబ్బంది బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.అదనంగా, కేంద్రంలో ఉన్న వంటశాల, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తువులు, తరగతి గది, రికార్డులు తదితరాలను పరిశీలించారు. చిన్నారుల బరువు, ఎత్తు, పోషకాహార పంపిణీ విధానంపై అంగన్వాడి టీచర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాధిక గుప్తా మాట్లాడుతూ –పిల్లల ఆరోగ్యం, భవిష్యత్ కోసం ఆంగన్వాడి కేంద్రాలు ఒక పెద్ద పునాది. తల్లిదండ్రులు కూడా పిల్లల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి” అని అన్నారు.స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు ఈ సందర్శనలో పాల్గొన్నారు.


