
మేడ్చల్ ముచ్చట్లు: నాగారం మున్సిపాలిటీ రాంపల్లి నుండి చర్లపల్లి వెళ్లే ప్రధాన దారి అస్తవ్యష్టంగా మారి వాహనదారులే కాక పాదాచారులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ కాలం వెల్లదీస్తున్నారు.ఈ దారి గుండా లారీలు, టిప్పర్లు, చర్లపల్లి ఇండస్ట్రీకి వెళ్లే భారీ వాహనాలు, కార్లు, రోజుకి కొన్ని వందల్లో తిరుగుతుంటాయి. రహదారి మొత్తం గుంతలతో నిండిపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రతి రోజు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారిపై అనేక సార్లు పత్రికలల్లో అనేక మధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పటికి అధికారుల్లో, నాయకుల్లో ఎటువంటి చలనం లేకపోవడం ఆశ్చర్యం.ఇటు పాలకులు పట్టించుకోక అటు అధికారులు స్పందించక ఇంకా ఎవరికి చెప్పాలి ఈ సమస్య అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల వద్ద పన్నులు కట్టించుకుంటున్నారు కాదా, ప్రజల కోసమే ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు కాదా, నాగారం కమిషనర్ కాస్త పరిష్కరించండి అంటూ వాహనదారులు, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మునిసిపల్ కమిషనర్ చొరవ తీసుకొని, రోడ్లు మరమ్మతు చేయించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.


