
మేడ్చల్ ముచ్చట్లు: మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దేమర్రి వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షం కారణంగా వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యగా వాగు వద్ద తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు. ఎవరూ వాహనాలతో వాగు దాటకూడదని బారికేడ్లు ఏర్పాటు చేసి, డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాల వినియోగంపై సూచనలు చేశారు.


స్థానికులు మాట్లాడుతూ – “ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య. వాగు మీద ఎత్తు పెంచి శాశ్వత బ్రిడ్జి నిర్మాణం జరిగితేనే ఇబ్బందులు తగ్గుతాయి. ప్రతి సారి వాగు పొంగితే మేము రోజువారీ అవసరాలకు కూడా వెళ్లకుండా కూడా ఇరుక్కుపోతున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
👉 ఉద్దేమర్రి వాగు కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన రాకపోకలు నీటి మట్టం తగ్గిన తరువాత పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


