మేడ్చల్ ముచ్చట్లు జవహర్ నగర్ లో సూర్యోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ప్రాంగణంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు జరగనుంది.క్యాంపు ప్రాంగణంలో భోజన సదుపాయం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ క్యాంపులో గుండె, గైనిక్, కళ్ళు, పళ్ళు, ఆర్తో, జనరల్ ఆయుర్వేదం, పిల్లల వైద్యులు మొదలైన పరీక్షలు జరిపి ఉచితంగా మందులు ఇవ్వనున్నారు.అవసరమైన వాళ్లకు ఉచితంగా ఆపరేషన్ చేయించనున్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.



