కీసర; తహశీల్దార్ గౌరీ వత్సల బదిలీ విషయం తెలుసుకున్న దమ్మాయిగూడ నాలుగవ వార్డు కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ వార్డు ప్రజలతో కలిసి ఎమ్మార్వోకి శాలువతో సన్మానం చేశారు . తహశీల్దార్ గౌరీ వత్సల పదవి బాద్యతలు చేపట్టిన నాటినుండి 58, 59 జీవో కు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రజలకు ఎంతో సహకరించిన ఎమ్మార్వోకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ ఉపాధ్యక్షులు మంగళ పూరి కిరణ్, నాలుగవ వార్డు ప్రధాన కార్యదర్శి ధనలకోట శ్రవణ్ కుమార్ వర్మ, ఆముదాల మంజుల, బిఆర్ఎస్ మహిళా నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.



