
మేడ్చల్ ముచ్చట్లు : ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ గ్రామం లొ స్కూల్ పిల్లల రక్షణ కోసమే ఏర్పాటు చేసిన బారికేడ్లు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాల వద్ద రోడ్డుపై వెళ్ళేవారికి ప్రాణభయాన్ని కలిగించే స్థితి చేరుకుంది.స్కూల్ ముందు బారికేడ్లు పెట్టాలి అన్న ఉద్దేశంతో అధికారులు తీసుకున్న నిర్ణయం, అనవసరంగా ప్రైవేట్ వ్యక్తుల లాభాలకు ఉపయోగపడుతోంది. బారికేడ్లు పాఠశాల ముందు కాకుండా కొంతమంది వ్యక్తులు తమ దుకాణాల ముందు పెట్టుకుని, వాటిని తన ప్రయోజనాలకే ఉపయోగించుకుంటున్నారాని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో, రోడ్డుకు రెండువైపులా ఉండవలసిన బారికేడ్లు ఒక వైపున మాత్రమే ఉండటం వల్ల వాహనదారులకు అసౌకర్యం, చిన్నపిల్లలకు ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. స్కూల్ ముందు ట్రాఫిక్ నియంత్రణ కోసమే బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగినా, వాటి అసలైన ఉద్దేశ్యం పక్కతోవపడుతుంది.


ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకుని, బారికేడ్లను విద్యార్థుల రక్షణకు అనుకూలంగా పాఠశాల ముందు పునఃస్థాపించాలి గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.


