గణేష్ మండపాల కమిటీలతో కీసర పోలీసుల అవగాహన కార్యక్రమం

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: కీసర మండల పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నాగారం మున్సిపాలిటీ,దమ్మాయిగూడా మున్సిపాలిటీ, సంబంధించిన గణేష్ మండప నిర్వాహన, ఉత్సవ కమిటీలతో పోలీస్ శాఖ తరపున సూరి బాబయ్య ఫంక్షన్ హాల్ లో ఎవర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ… ఈ ఎవర్నెస్ మీటింగ్ రాచకొండ సిపి డి ఎస్ చౌహన్ సూచనల మేరకు ఏర్పాటు చేయబడిందని , ఈ మీటింగ్లో గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే అవి మరల పునరావితం కాకుండా వారి దగ్గర నుండి సూచనలు తీసుకొని ఈ సంవత్సరం గణేష్ మండపాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గణేష్ మండపాలకు పర్మిషన్ , గణేష్ విగ్రహాల హైటు ఎక్కువ లేకుండా చూసుకొవాలని అన్నారు. గణేష్ మండపాల ఆర్గనైజేషన్ లతో మాట్లాడి గణేష్ మండపాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. గణేష్ మండపాలకు అక్రమంగా విద్యుత్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదే విధంగా కాలనీలలో మైకులు, డిజేల వలన కాలనీవాసులకు ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఊరేగింపు సమయంలో డీజేలకు నిషేధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య, ఎస్సై రాజేష్ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, నాగారం చైర్మన్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, దమ్మైగూడ కౌన్సిలర్లు, జిహెచ్ఎంసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ఎస్ దినేష్ కుమార్.

Share This Article
Leave a Comment