గులాబీమయంగా మల్కాజ్గిరి

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు;మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో వేల సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మల్కాజ్గిరి అంతా గులాబీ మయంగా మారింది, ఎటు చూసినా గులాబీ జెండాలతో కార్యకర్తలు, ప్రజలు హుషారుగా ర్యాలీలో పాల్గొని మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బొల్లారంలోని శ్రీ ముత్యలమ్మ దేవాలయం, మల్కాజిగిరిలోని వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment