ఘట్కేసర్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు:మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ మండలం ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీ అధ్యక్షులు  టీవీ వేణుగోపాల్ (10tv)మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం,సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని  అన్నారు. అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన  రాధాకృష్ణ(స్టార్ 9 న్యూస్) మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిరక్షణ మరియు జర్నలిస్టుల పై దాడులు అరికట్టేందుకు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ఇళ్ల పట్టాల మంజూరు కోసం కృషి చేస్తానని అన్నారు ..అధ్యక్షుడిగా టెన్ టీవీ వేణు గోపాల్, ఉపాధ్యక్షుడిగా వి6 భూపాల్, ప్రధాన కార్యదర్శిగా రాధాకృష్ణ స్టార్ 9 న్యూస్, సంయుక్త కార్యదర్శిగా బిగ్ టీవీ వెంకట్ రెడ్డి, కోశాధికారిగా సాక్షి టీవీ రవీందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎన్ టివి రామ్ చందర్, టీ న్యూస్ రాకేష్, హెచ్.ఎం.టీ.వి కరుణాకర్ గౌడ్, స్వతంత్ర టీవీ రాజు గౌడ్, జీ తెలుగు న్యూస్ జీవన్ గౌడ్, సలహాదారులుగా రాజ్ న్యూస్ సతీష్, 99 టీవీ వెంకట్ గౌడ్, అర్.టీవీ రమేష్, ముఖ్య సలహాదారులుగా ఐ న్యూస్ సంతోష్, కార్యవర్గ సభ్యులుగా కార్తీక్,సుందర్,సన్నీ,సుమన్ ఎన్నికయ్యారు ..

Share This Article
Leave a Comment