
కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి మల్లారెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి,చేతికి ఇమామే జామీన్ కట్టారు. ఈ ఇమామే జామీన్ విజయానికి చిహ్నంగా భావిస్తారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, ఆతదుపరి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అఫ్జల్ ఖాన్ కు ఎమ్మెల్సీ పదవి తప్పకుండా వస్తుందని, దాని కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డి ఎంతో తీరిక లేకుండా ఉన్న సమయంలో కూడా ఆప్యాయంగా పలకరించి ఎవరి సమస్యలు ఏంటో వింటూ, వాటి పరిష్కారానికి తన పూర్తి సమయం కేటాయిస్తారని, తనకు ఎమ్మెల్సీ పదవి కోసం కృషి చేస్తున్న మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కి అఫ్జల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు మహ్మద్ గౌస్, ఎం ఎ రహీం తదితరులు పాల్గొన్నారు.


