మేడ్చల్ ముచ్చట్లు; అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) పంపిణీ చేసిన ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి. సైనిక్ పూరిలోని బిఎల్ఆర్ కార్యాలయంలో మల్లాపూర్ డివిజన్ కి చెందిన సంధ్య ( 60,000/-), మీర్ పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ కి చెందిన వెంకటేశ్ (60,000/-) లకు మంజూరు ఐన చెక్కులను అందజేశారు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కాటర్ల భాస్కర్, గుమ్మడి జంపాల్ రెడ్డి, నరేశ్, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.




